Basara Saraswathi Temple Adilabad District of Telangana
India, also considered as the land of temples has a unique legend associated with each of its temples which lends a mythical charm for them. One such temple in India is that of Gnana Saraswathi at Basar which holds a prominent place. Basar is located on the banks of Godavari River, 34 km from the district headquarters of Nizamabad, very close to Maharashtra border in the North Telangana region.
Basara Saraswathi Temple Adilabad District of Telangana
This temple is an abode of Goddess Saraswathi, Goddess Lakshmi and Kali considered as the Holy Trinity. Legends says that Veda Vyasa, his followers and sage Suka had desired to stay at in a serene environment after the Kurukshetra War. Searching for a peaceful abode, they then moved into the Dandakaranya forest and finally chose this place owing to peaceful climate. Maharishi Vyasa was known for performing his regular ablutions in the Godavari river. Each day after this process he used to get sand in fists and made them into images of Goddess Saraswathi, Lakshmi and Kali by means of his mystic power and offered prayers. The place derives its name from Vyasa and called Vasar or Basar (Basara in local dialect). It is also considered to be among the three temples created near the holy confluence of the Manjira and Godavari Rivers by the Ashtrakutas. A Karnataka king by the name Bijialudu reportedly constructed the current temple at Basar.
Basara Saraswathi Temple Adilabad District of Telangana
Basar is an ideal destination for performing "Akshara Abhyasam" where children perform a ceremonial start before starting formal school education. The Puja begins at the temple daily at 4 am while Alankarana starts at 5 am in a pious atmosphere. The temple is flocked by devotees all round the year especially during Maha Shivaratri, Devi Navarathrulu. The temple can be reached by bus and train from Hyderabad (205 km away) and Nizamabad.
Basara Saraswathi Temple Adilabad District of Telangana
ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ప్రశాంతంగా తపస్సు చేసుకునేందుకని వ్యాసమహర్షి మరియు విశ్వామిత్ర మహర్షి మొదలగు వారు శిష్యసమేతంగా ఈ ప్రాంతానికి వచ్చారు . ఈ ప్రదేశంలో ప్రశాంత వాతావరణాన్ని చూసి ముగ్ధులై.. ఇక్కడే తపస్సు చేసుకోవాలని అనుకున్నారు . వ్యాస భగవానులు రోజూ పరమ పవిత్రమైన గోదావరినది లో స్నానం చేశాక.. పిడికెడు ఇసుక చొప్పున తీసుకు వచ్చి సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని రూపొందించారు ! ఆవిగ్రహాని కే ఆయన నిత్యపూజలు చేసేవారు . ఇప్పుడు ఇక్కడున్న విగ్రహం అప్పట్లో వ్యాస మహర్షి ఆరాధించిన మూర్తేనని స్థలపురాణం చెప్పుతుంది . అలా వేద వ్యాస ప్రతిష్ఠగా పరిగణించే బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి సన్నిధిలో నిత్యం వేల మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేసుకుంటూ ఆ తల్లి దీవెనలు చల్లని చూపులతో విద్యావంతులుగా ఎదుగుతున్నారు.
దేవాలయం తెరచే సమయాలు:
- రోజూ ఉదయం 4 గంటలకే ఆలయద్వారాలు తెరుస్తారు.
- ఉదయం 4.30 గంటలకు అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు.
- అనంతరం 4.30 నుంచి 6.30 వరకూ అభిషేకం కొనసాగుతుంది.
- 6.30 నుంచి 7.30 గంటల వరకు విరామం.
- ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాధారణ దర్శనం, ప్రత్యేక దర్శనం, అక్షరాభ్యాస పూజలు నిర్వహిస్తారు.
- మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.00 గంటల వరకు మధ్యాహ్న విరామం.
- మధ్యాహ్నం 2 నుంచి 6.30 వరకు దర్శనం, పూజలు.
- సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సాయంత్ర ప్రదోషకాల పూజలు చేస్తారు .
- రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు హారతి. అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు.
వివిధ ఆర్జిత సేవలు/ పూజల వివరాలు
- అభిషేకసేవ టిక్కెట్టు: రూ.200- ఒక కుటుంబం లేదా నలుగురు మాత్రమే.
- ప్రత్యేక దర్శనం ఒక టిక్కెట్టుపై ఒకరు మాత్రమే.
- సాధారణ అక్షరాభ్యాసం: రూ. 100.
- ప్రత్యేక అక్షరాభ్యాసం: రూ. 1000.
- నిత్య చండీ హవనం: రూ. 500.
- కుంకుమార్చన రూ.50.
ఇతర దేవతలు : ప్రధాన సరస్వతీ ఆలయ అంతరాలయంలో మహాలక్ష్మీ అమ్మవారు . ఆలయానికి పశ్చిమ దిక్కులో మహాకాళీ అమ్మవారు కొలువై ఉంటారు. అంటే ఈ ఆలయం త్రిశక్తులైన లక్ష్మి.. పార్వతి.. సరస్వతి అమ్మవార్లు కొలువైన మహిమాన్విత క్షేత్రమన్న మాట. ఆలయానికి తూర్పున దత్తాత్రేయుడు, ఆలయం ముందు ప్రధాన రహదారి వద్ద వేదవ్యాస మహర్షి ఆలయం, వ్యాసుల వారి గుహ, గోదావరి నది. గోదావరినదీ తీరాన మహేశ్వర ఆలయం ఉన్నది . బస్టాండ్ సమీపంలోని వేదశిల (శ్రీ వేదవతిశిల) చూడవలసినవి ఉన్నాయి .
ఆలయంలో నిత్యం నిర్వహించే వివిధ పూజలు: అభిషేకం, అక్షరాభ్యాసాలు, సత్యనారాయణ వ్రతాలు, చండీ హవనం, కుంకుమార్చన.
ప్రత్యేక ఉత్సవాలు:
- సరస్వతి అమ్మవారి జన్మదినమైన వసంత పంచమి నాడు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. మహాభిషేకంతో పాటు అమ్మవారి పల్లకి సేవ కూడా నిర్వహిస్తారు.
- దసరా నవరాత్రి ఉత్సవాలనూ ఇక్కడ ఘనంగా చేస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మూల నక్షత్ర పర్వదినం రోజున మూల నక్షత్ర మహా సరస్వతీపూజ నిర్వహిస్తారు.
- గురుపౌర్ణమి సందర్భంగానూ ఇక్కడ ఆనేక విశేష పూజలు నిర్వహిస్తారు. సప్తశతి చండీయాగం చేసి వేద పండితులకు సన్మానం నిర్వహిస్తారు.
ఇక్కడ నిర్వహించే పూజలు: ప్రత్యేక దర్శనాలకు సంబంధించి ఆన్లైన్ బుకింగ్ సౌకర్యమేమీ లేదు.
మరిన్ని వివరాలకు ఆలయ విచారణ కేంద్రం ఫోన్: 08752-255503 నెంబరులో లేదా.. వెబ్సైట్:basaratemple.org ఇ-మెయిల్ ఐడీ:infobasaratemple.orgలేదా.. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయంలోనైనా సంప్రదించవచ్చు.
Basara Accodomation….బాసర వసతి వివరాలు
వసతి వివరాలు:
బాసర సరస్వతీ ఆలయానికి వచ్చే భక్తుల వసతి కోసమని దేవస్థానం 100 సాధారణ గదులు, 18 ఏసీ గదులు అందుబాటులో ఉంచింది . ఇంకా ఆలయం వద్ద వివిధ ఆలయాల నిధులతో నిర్మించిన అతిథి గృహాల్లోనూ వసతి అందుబాటులో ఉంది. పర్యాటక శాఖ వారి హరిత అతిథిగృహంతో పాటు పలు ప్రైవేటు లాడ్జిలు, రిసార్టుల్లోనూ వసతి సౌకర్యము కలదు . బాసరలోని హోటళ్ల సమాచారం కోసం www. basarahotels.com వెబ్సైట్ను చూడొచ్చు.
టి టి డి దేవాలయం వారి అతిథి గ్నృహం 4 గదులు ఒక్కొక్క గది ఎ.సి రూమ్ : 400- నాన్ ఎ సి రూ.150-(ఒక్క రోజుకు)
వేములవాడ అతిథి గృహం : 4 గదులు ఒక్కొక్క గది రూ.75- ఒక్క రోజుకు
నీలం ఘేకర్ అతిథి గృహం -4 గదులు (దాతలు కట్టించినవి) ఒక్కొక్క గది రూ.100- ఒక్క రోజుకు
గౌర్ల అతిథి గృహం: 2 గదులు (దాతు కట్టించినవి) ఒక్కొక్క గది రూ.150- ఒక్క రోజుకు
థర్మశాల : 9 గదులు ఒక్కొక్క గది రూ.100- ఒక్క రోజుకు
టిటిడి వారి అతిథి గృహాం -100 రూములు పెద్దవి ఒక్కొక్క గది రూ.100- ఒక్క రోజుకు
ఇవి కాక ఎ పి టి డి సి వారి పున్నమి హోటల్ వివరాలకు :08752-243691 మరియు బ్రాహ్మణుల సత్రం, వైశ్యుల సత్రం దేవాలయంనకు దగ్గరలో కలవు.
ఇవికాక ప్రైవేటు వారి లాడ్జీలు 20 దాకా ఉన్నవి
Post a comment