Edunuthula Sri Veunugopala Swamy Devalayam Edunuthula in Telangana శ్రీ రుక్మణి సత్యబామ సమేత వేణుగోపాలస్వామి

 ఏడునుతుల అతి పురాతన గ్రామము  ఇక్కడ  చూడవలసిన  ప్రదేశాలు  చాల ఉన్నాయి Edunuthula Sri Veunugopala Swamy Devalayam Edunuthula in Telangana
.
 శ్రీ రుక్మణి సత్యబామ సమేత  వేణుగోపాలస్వామి వారు దేవస్థానంలో   కోలువై  ఉండి దర్శనం చేసుకున్న  భక్తులు కోరిన కోర్కెలు  తిర్చుచున్నారు  .
ఇక్కడ  వినాయక  అంజనేయ దేవాలయము  నిత్య పూజలతో భక్తులు పూజిస్తున్నారు ,అంజనేయు నికి 41 రోజులు నిత్య పూజ లు  చేసినచో పెళ్లి  కానివారికి  త్వరగా  పెళ్లి సంబంధం కుదురు చున్నవి . వారు కోరిన కోరికలు తిర్చుచున్నారు .
వేణుగోపాలస్వామి దేవాలయం చరిత్ర :-


1600 ల సంవత్సరాల  కాలం నాటి అతి పురాతనమైన రాతి కట్టడం కలిగిన దేవస్థానం.



ఇక్కడ తూర్పు ,పడమర ,ఉత్తరం ద్వారాలు కలిగిన దేవాలయం
ఉత్తరం వైపు కొలువై ఉండి భక్తులకు స్వామి వారు దర్శనం  ఇస్తున్నారు.
 శ్రీ రుక్మణి సత్యబామ సమేత  వేణుగోపాలస్వామి కి వైశాఖ మాసం లో  బ్రహ్మోత్సవాలు  వైభవంగా  జరుగుతాయి .
 అంకురార్పణ :-
స్వామివారి బ్రహ్మోత్సవాలు ‘అంకురార్పణ’తో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల ఆరంభదినానికి ముందురోజుగానీ మూడు రోజులు, అయిదు రోజులు, ఏడు రోజులు, తొమ్మిదిరోజుల ముందుగానీ అంకురార్పణ జరుగుతుంది.
ఇలా నిర్ధారితమైన రోజున, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకై స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు, ఆలయంలో నైరుతిథిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. ఆ తర్వాత, నిర్ణీత పునీత ప్రదేశంలో, భూదేవి ఆకారాన్ని లిఖించి, ఆ ఆకారమునందు లలాట, బాహు, స్తన ప్రదేశాలనుంచి మట్టిని తీసి, స్వామివారి ఆలయంలోకి వస్తారు. దీన్నే ‘మత్సంగ్రహణం’ అంటారు. Edunuthula Sri Veunugopala Swamy Devalayam Edunuthula in Telangana
యాగశాలలో, ఈ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో- శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలను పోసి, పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికలలోని నవధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. అందుకే ఈ వేడుకలన్నీ శుక్లపక్షంలో జరుగుతాయి. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తర్వాత పూర్ణకుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరుపోసి, అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇదే ‘అంకురార్పణ’ అయింది.తరువాత  నివేదన, మంగళ హారతి, మంత్రపుష్ప వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు 
మొదటి రోజు:-
ధ్వజారోహణం  వేణుగోపాలస్వామి  ముందుగా   బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం ‘ధ్వజారోహణం’. ఆరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాలసేవలు జరిగాక.. రుక్మణి సత్యబామ సమేత  వేణుగోపాలస్వామి కి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయసన్నిధిలోని ధ్వజస్తంభంమీద పతాకావిష్కరణ చేస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్త వస్త్రంమీద గరుడుడి బొమ్మ చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు.
దీన్ని ‘గరుడధ్వజపటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభంమీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. గరుడధ్వజపటాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, ఉత్సవ మూర్తులైన రుక్మణి సత్యబామ సమేత  వేణుగోపాలస్వామి ల సమక్షంలో- గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి చేరుస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే- సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రం.
అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకూ ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ, రాక్షసగణాలకు, వారివారి నిర్ణీత స్థలాలను కేటాయించి, పద్ధతి ప్రకారం, వారి నియమాల ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే.
మధ్యాహ్నం యాగశాల ప్రవేశము తరువాత  నివేదన, మంగళ హారతి, మంత్రపుష్ప వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు 


    ధ్వజారోహణం తర్వాత,  రుక్మణి సత్యబామ సమేత  వేణుగోపాలస్వామిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, యజ్ఞశాల మంటపంలో ఉన్న శేష వాహనంపై ఊరేగిస్తారు.
అనంతరం ఉత్సవమూర్తులను  గర్భగుడి లో విశ్రమింపజేస్తారు.
రెండో రోజు :-  
నిత్యపూజ,గణపతి పూజ, స్వస్తివచనం, పంచకావ్య ప్రసనం, అంకురార్పణ, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరిగాయి. నిత్య కైంకర్యాల తోపాటు రుక్మణి సత్యబామ సమేత  వేణుగోపాలస్వామి వారికీ  పంచామృతాలతో అభిషేకం చేస్తారు.యాగశాల లో యాగం చేస్తారు . నివేదన, మంగళ హారతి, మంత్రపుష్ప వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు 
సాయంత్రం  స్వామి వారిని  అలంకరణ చేస్తారు తరువాత శ్రీ  వేణుగోపాలస్వామి వారు అశ్వవాహనం పై ఊరేగింపుగా ఎదురుకోలు కొరకు గ్రామా కచ్చిరు కాడికి వెళతారు
 అప్పటికే  అలంకరణ చేసిన   రుక్మణి సత్యబామ ను ఒక పల్లకి లో ఊరేగింపుగా ఎదురుకోలు కార్యక్రమం  గ్రామా కచ్చిరు కాడికి  బయలు దేరుతారు అక్కడ  రుక్మణి సత్యబామ సమేత  వేణుగోపాలస్వామి వారికీ ఎదురుకోలు క్రార్యక్రమం లో వేదపండితుల గ్రామా ప్రజల సమక్షం లో  జరుపుతారు  .
అనంతరం  రుక్మణి సత్యబామ సమేత  వేణుగోపాలస్వామి వారు కల్యాణ మండపం కు వేచేస్తారు
వేదపండితులు రుక్మణి సత్యబామ సమేత  వేణుగోపాలస్వామి కి  ఆగమ శాస్త్రం ప్రకారం కళ్యాణం   రాత్రి వైభవంగా కనులపండువగా జరుపుతారు     నివేదన, మంగళ హారతి, మంత్రపుష్ప వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు 
మూడవ రోజు :-
 నిత్యపూజ,గణపతి పూజ, స్వస్తివచనం, పంచకావ్య ప్రసనం, అంకురార్పణ, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరిగాయి. నిత్య కైంకర్యాల తోపాటు .యాగశాల లో మహా పూర్ణాహుతి  బలిహరణ  జరుగుతాయి 
చక్రస్నాన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత విశేష అభిషేకాల అనంతరం చక్రస్నాన కార్యక్రమాలను దేవస్థానం ప్రధానార్చకులు, వేదపండితులు జరిపించారు.
బళ్ళు తిరుగుట ,శ్రీ పుష్ప యాగం ,పారు వేట నాగవెల్లి ,ఉంజల సేవ ,ద్వాదశ ఆరాధనా ,ద్వాదశ ప్రదక్షిణ ,దోపు జరుగుతాయి
  ఆరోజు రాత్రి  ఆలయ ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం (దించడం) చేస్తారు.
 ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లే. బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చేసి రాత్రి దేవస్థానంలో విశేషంగా ఏకాంతసేవ అలంకారం జరిగింది.
తరువాత  నివేదన, మంగళ హారతి, మంత్రపుష్ప వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు 
మంచినీటి బావి :-


 



ఏడునుతుల పేరు గల బావి ఉన్నది
 . గ్రామం లో కాకతీయుల కాలం లో వర్షలు లేక గ్రామం కరువు కాటకాలతో ఉన్న సమయం లో    వేణుగోపాలస్వామి వారు  గ్రామం లో ఉన్న ఏడుగురు అక్క చేల్లెలు ఉన్న ఇంటిలో రాత్రి ఏడుగురు అక్క చేల్లెలకు స్వామి వారు కలలో కనిపించి మీరు చెరువు ప్రక్కన బావి తొవ్వండి గ్రామం లో కరువు పోతుంది అని చెప్పినారు.  వెంటనే  ఆ ఏడుగురు అక్క చేల్లెలు ఏడుమాసాల పాటు కష్టపడి బావిని తొవ్వి ,ఏడూ కానాల తో ,77 పెధ్ద పెధ్ద  రాతి పలకలతో బావి చుట్టూ వాలు నిర్మిచారు , అప్పటి నుండి గ్రామం లో కరువు కనపడకుండా పోయినది .
ఇప్పటికి ఆ బావి నీటి నే గ్రామం లో మంచి నీటి గా వాడతారు
 ఇక్కడ  అండాలమ్మ  వారు  నిత్య పూజతో  ఉంటున్నారు  పెళ్లి  కాని అమ్మయిలు  ఇక్కడ  అమ్మవారికి  వ్రతం చేసినచో  కళ్య ణము  జర్గుతున్నది .పిల్లలు లేని దంపతులు  వ్రతం చేసినచో వారి కోరికలు తీర్చుతున్నరు .ఇక్కడ వాహన  పూజ ,నవగ్రహ  పూజ ,గణపతి  పూజ ,లక్ష్మి  పూజ, హనుమాను  పూజ, స్వామి వారికీ  కుంకుమ ఆర్చన ప్రత్యేక పూజలు చేయబడును
Full Information Click Here