Edupayala Vana Durga Bhavani Temple in Telangana

Edupayala Vana Durga Bhavani Temple in Telangana

Edupayala Vana Durga Bhavani Temple in Telangana

8 Kms from Medak District at Edupayala is the Edupayala Vana Durga Bhavani temple dedicated to the most powerful Goddess Kanakadurga. According to the legend, Maharaja Parikshit (the grandson of the great warrior Arjun) performed “Sarpa Yagya” to get rid of a curse. And when Garuda, the eagle, was transporting the snakes used in the Yagna, their blood is said to have fallen in seven different places. And the place where blood spilled became streams. All the seven streams meet here at Edupayala to form river Manjeera. This picturesque location marks the confluences of these seven rivulets into the Manjeera River and hence the name Edupayala, which in Telugu means Edu (seven) and Payalu (streams).

Edupayala Vana Durga Bhavani Temple in Telangana

Edupayala Vana Durga Bhavani Temple in Telangana

The Edupayala Durga Bhavani temple is a highly revered shrine of goddess Durga bhavani in the Telangana state. Edupayalu is an unusual place with many natural stone formations. On the day of Shivaratri and Maagha Amavaasya, the locals celebrate a jatara.

 Edupayala Vana Durga Bhavani Temple in Telangana

   How to Reach:-
The temple is located at a distance of nearly 18 km from Medak and is well accessible by road.

    Where to eat:-
There are few eateries available here. Medak town is the right destination for quality food.

    Where to stay:
Medak town is the right option for quality accommodation. There are few options available here for accommodation.

    Emergency:-

 Rvm Institute Of Medical Sciences And Hospital
Survey No.54, Mulugu Mandal, Medak District, Laxmakkapally, Telangana 502279
084542 44344

Siddhartha Hospital
1, Shivaji Nagar, Old Bus Stand, Siddipet, Telangana 502103
084572 28888

Form City              Via Distance (kms)
Hyderabad Tupran / Chegunta / Medak 110 kms
Kamareddy Ramayampet / Medak 67 kms
Karimnagar Siddipet /Ramayampet / Medak 150 kms
Medak Meera colony 19 kms
Sangareddy Ismailkhanpet/ Jogipet 66 kms
Nizamabad Kamareddy / Ramayampet / Medak 125 kms
Vikarabad Sadasivapet / Sangareddy / Jogipet 130 kms
Edupayala Vana Durga Bhavani Temple in Telangana
మెదక్‌జిల్లా పాపన్నపేట సమీపంలో ఏడుపాయల గుట్టలో వనదుర్గాదేవి ఉత్సవం ప్రతి శివరాత్రికి మూడు రోజుల పాటు వైభవంగా జరుగుతుంది. ఈ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకునేందుకు దాదాపుగా 15 లక్షల మంది భక్తులు  వస్తారు. మన రాష్ట్రంనుండే కాక పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్ర నుండి కూడా వేలాదిగా భక్తులు వస్తారు.
కొండకోనలలో ప్రవహిస్తున్న మంజీరా నది ఇక్కడకు వచ్చేసరిగా ఏడుపాయలుగా చీలుతుంది. ఇక్కడే కొండగుట్ట సొరంగంలో అమ్మవారు వనదుర్గామాతగా వెలసిందంటారు. పోతురాజు నృత్యాలు, శివసత్తుల పూనకాలు, బోనాలు, బండ్ల ఊరేగింపుతో జాతర సందడిగా ఉంటుంది.
జాతర మొదట రోజు మంజీరానదిలో స్నానాలతో మొదలవుతుంది. ఆరోజునుంచి స్త్రీలు అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పిస్తారు. పసుపు కలిపిన బియ్యంలో ఎండువక్కలు, ఖర్జూరాలు, కుడుములు, తమలపాకులు, రవికె, కొత్త చీరెను ఉంచి వనదుర్గాదేవికి మొక్కులు చెల్లించుకుంటారు.
రెండవరోజు అమ్మవారికి ఫలహారబండ్ల ఊరేగింపు, మూడోరోజు రధోత్సవం వైభవంగా జరుగుతాయి. వనదుర్గాదేవి ఆలయంతో పాటు ఇక్కడున్న తపోభూమి, పాపాల మడుగు, సంతానగుండం, ముత్యాలమ్మగుడి, శివాలయం, వంటి చోట్ల కూడా భక్తులు పూజలు చేస్తుంటారు.
అమ్మవారి ఆలయం ముందు పెద్ద బండరాయుపై ఒక జంట మాత్రమే స్నానం చేయటానికి గుండం ఉంది. సంతానం లేని దంపతులు ఈ గుండంలో స్నానం చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. జాతర సమయంలోనే కాక మిగతా రోజులలో కూడా పిల్లలు లేని దంపతులు ఈ గుండంలో స్నానం చేస్తారు.
ద్వాపర యుగాంతంలో పాండవ వంశంలోని అర్జునుడి మనవడు, అభిమన్యుని పుత్రుడు పరీక్షత్తు మహారాజును శాపఫలితంగా సర్పరాజైన కర్కోటకుడు కాటువేసి చంపుతాడు. పరీక్షత్‌ మహారాజు పుత్రుడు జనమేజయుడు సర్పజాతి మీద పగబట్టి సర్పజాతిని అంతం చేయటానికి ఏడుగురు మహర్షుల సాయంతో  యజ్ఞం చేస్తాడు. ఆనాడు యజ్ఞం జరిగిన ప్రాంతం ఇదేనంటారు. యజ్ఞగుండంలో ఆహుతి ఐన సర్పాలకు సద్గతులు కలిగించడానికి గరుడుడు పాతాళంలో ప్రవహించే భోగావతి నదిని భూమీ మీదకు తీసుకు వచ్చి   ఆ నది ఏడుపాయలుగా చీలి ఏడు యజ్ఞగుండాల మీదుగా ప్రవహించిందని పురాణ గాధ.
ఆనాటి భోగావతి నదియే నేడు మంజీరా నదిగా పేరుమారిందని చెబుతారు. ఇక్కడ ఉన్న నది ఏడుపాయలను జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ట, భరద్యాజ, గౌతమ అని ఏడుగురు ఋషుల పేర్లుతో పిలుస్తారు.