Jain Mandir Kolanupaka Yadadri Bhuvanagiri in Telangana

Jain Mandir Kolanupaka Yadadri Bhuvanagiri in Telangana

Jain Mandir Kolanupaka Yadadri Bhuvanagiri in Telangana

The beautiful and clean city Warangal houses yet another very significant temple. In the place called Kolanupaka, 2 kilometers away from the Warangal railway station is a classy Jain temple. This a true example of beauty paired with uniqueness. We already know that the Jain Community is a peace-loving one, and so is this marvelous temple. The Jain Temple stands pretty for over two thousand years now, and has stood as a grand testimony of our glorious history. The place still contains the remnants of the commendable works in the areas of architecture and engineering. The Jain temple is the proud possessor of an awe-inspiring 5 feet high image of Thirthankaras. The idol is engraved out of a rare kind of jade. It is a very important place of worship for the Jains in the country.

Jain Mandir Kolanupaka Yadadri Bhuvanagiri in Telangana

The place is serene and somber. Amidst the peaceful surroundings, the temple of the great Saint Mahaveer stands with its own sheer size and solemnity. The Jain Temple speaks volume about the sophisticated Jain culture and their ways of life.

    How to Reach:-

Kolanupaka Jain temple is at a distance of nearly 80 km from Warangal city and 4 km from Aler town.

Jain Mandir Kolanupaka Yadadri Bhuvanagiri in Telangana
 

   Temple Timings:-
All Days of the Week
Monday – Friday: 5.00 AM – 8.00 PM
Saturday: 5.00 AM – 8.00 PM
Sunday: 5.00 AM – 8.00 PM
Public Holidays: 5.00 AM – 8.00 PM

    Where to eat:-
There are few hotels available for tourists at Aler town.

    Where to stay:-
Tourists can choose either Warangal or Hyderabad (60 km away) for accommodation purpose.
    Emergency:-
 Mahatma Gandhi Memorial Hospital
Sherpura, Warangal, Telangana 506007
099638 67620

Kakatiya Medical College
Rangampet Street, Warangal, Telangana 506007
0870 244 6355
    Contact:-
Phone number
092470 15696

Form City   Via Distance (kms)
Hyderabad Bhongiri/Aleru 77 kms
Karimnagar Siddipet / Duddada / Buchannapet 115 kms
Nalgonda Ramannapeta / Valigonda / Bhongiri – Aleru 101 kms
Nizamabad Kamareddy / Ramayampet / Siddipet 186 kms
Vijayawada Kodad / Suryapet / Jangam /- Aleru 249 kms
Warangal Kazipet/ Jangam 80 km
Yadagirigutta Wangapalli / Aleru 22 kms

Jain Mandir Kolanupaka Yadadri Bhuvanagiri in Telangana

Jain Mandir Kolanupaka Yadadri Bhuvanagiri in Telangana

కొలనుపాక తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లా లో ఉన్నది . జిల్లా ప్రధాన కేంద్రం అయిన భువనగిరి నుండి 30 కిలోమీటర్ల దూరంలోను , వరంగల్ – హైదరాబాదు మార్గంలో హైదరాబాదుకు 65 కి.మీ, ఆలేరుకు సుమారు 6 కి.మీ. దూరంలో కొలనుపాక  గ్రామం కలదు. కొలనుపాక అనే గ్రామనామం కొలను అనే పూర్వపదం, పాక అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కొలను అనే పదం  చిన్న లేదా మధ్యపాటి చెరువు అన్న అర్థం వస్తోంది. పాక అనేది గృహము అని అర్థం  వస్తోంది .
గ్రామ చరిత్ర
ఈ గ్రామం పేరు అనేక రూపాంతరాలు చెందింది.పూర్వము ” కాశీ కొలనుపాక బింభావతి పట్టణం “గా పిలువబడేంది . మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీని పేరు కొల్లిపాకై. కాకతీయ రుద్రదేవుని కాలంనాటి శాసనంలో కూడా కొల్లిపాక అని ప్రస్తావించబడింది. విజయనగర రాజుల కాలంనాటికి కొల్పాక్”గా మారింది. ప్రస్తుతం ‘కూల్పాక్’ లేదా ‘కొలనుపాక’ అని పిలువబడుతున్నది.
 గ్రామము చరిత్రాత్మక ప్రదేశము మరియు సుప్రసిద్ద పుణ్యక్షేత్రము, కొటొక్క (కొటి ఓక్కటి) లింగము నూట ఓక్క చెరువు – కుంటలు ఉన్నాయి. ముఖ్యంగా స్వయంభూ లింగము వెలసి, శ్రీ శ్రీ సొమేశ్వరస్వామిగా అవతరించాడు. రేణుకా చార్యుని జన్మ స్థలము (సోమేశ్వర ఆలయం) వీరనారాయణస్వామి దేవాలయము, సాయిబాబా దేవాలయము, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం ముఖ్యంగా జైన దేవాలయము, 22 రకాల మఠాలు (వీరశైవ ఆలయాలు) ఉన్నాయి. ఈ స్థలాలన్నిటినీ సకుటుంబ సమేతంగా దర్శించవచ్చు.

కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి క్షేత్రం
నల్గొండజిల్లా ఆలేరుమండలంలోని కొలనుపాక వీరశైవ సిద్ధ క్షేత్రం. శైవమతస్థాపకుడుగా పూజింపబడుచున్న శ్రీ రేణుకాచార్య ఇక్కడే లింగోద్భవం పొంది వేయి సంవత్సరాలు భూమండలం మీద శైవ మతప్రచారము చేసి, మళ్ళీ ఇక్కడే లింగైక్యంపొందినట్టు సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో వ్రాయబడి వుందని స్థలపురాణం.
దేవాలయ ఆవరణనిండా ఎన్నో శిథిలమైన శాసనాలు, ఛిద్రమైన విగ్రహాలు మనకు కన్పిస్తాయి. దేవాలయ ప్రాంగణాన్ని, ప్రాకార మండపాలనే మ్యూజియంగా ఏర్పాటుచేశారు పురావస్తుశాఖ వారు. ఈ ఆలయం క్రీ.శ 1070 – 1126 మధ్య నిర్మాణం జరిగినట్లు భావించబడుతోంది. పశ్చిమ చాళుక్యుల పాలనలో నిర్మించబడి ఉంటుందని చరిత్ర కారులు భావిస్తున్నారు.
కొలనుపాక జైనదేవాలయం
రెండువేల సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయ ప్రవేశ ద్వారం కోటద్వారాన్ని తలపిస్తుంది. అక్కణ్ణుంచి రెండు నల్లని ఏనుగులు లోపలికి ఆహ్వానిస్తున్నట్లుంటాయి. ఆలయ నిర్మాణానికి ఢోల్‌పూర్ రాయిని రాజస్థాన్ నుంచి తెప్పించారు. బయటకు వచ్చేందుకు కుడిపక్కా ఎడమపక్కా రెండు ద్వారాలున్నాయి. లోపలంతా భారీ గోపురం. ప్రతి స్తంభంలోనూ సూక్ష్మచిత్రకళ అబ్బుర పరుస్తుంది.
ఇందులో ఆదినాథుడు, మహావీరుడు, నేమినాథుడు లాంటి జైనదేవుళ్ళ బొమ్మలే ప్రధాన ఆకర్షణ. ఆలయం లోనికి అడుగుపెట్టగానే ఎడమవైపునుంచి తీర్థంకరుల బొమ్మలు కనిపిస్తాయి. ఇందులో బంగారం, పాలరాయి, నల్లరాతితో చేసినవి ఉన్నాయి. లోపల నేలంతా పాలరాయే. ఆలయ ఆవరణమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ జైనుల పండుగ దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
మూల విరాట్టుకు కుడివైపున గల గర్భగుడి లో 1.5 మీ. ఎత్తైన మహావీరుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం కుంభకంతో కూడిన సిద్దాసనం మరియు అర్ధ పద్మాసనంలో ప్రశాంతమైన యోగముద్రలో ఉన్నది. వజ్ర విశేషజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇది ఫిరోజా రాతితో నిర్మించబడింది. ఇలాంటి అత్యధ్బుతమైన ప్రతిమ భారత దేశంలో మరెక్కడా లేదు. నలుపురంగులో ఉన్న మాణిక్య దేవ ఋషభ దేవ విగ్రహము భరత చక్రవర్తి నెలకొల్పిన అతి ప్రాచీనమైన విగ్రహం. ఈ విగ్రహం మధ్య గర్భగుడిలో మూల నాయక రూపంలో నెలకొని యున్నది.
రవాణ సదుపాయాలు
తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు నుండి బస్ మరియు రైలుబండి సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాదు మహాత్మా గాంధీ బస్ స్టాప్/ జూబ్లి బస్ స్టేషను నుండి వరంగల్ లేద హన్మకొండ మరియు జనగాం వెల్లే బస్ ఎక్కి ఆలేర్లో దిగాలి. ఉప్పల్ రింగ్ రోడ్డ్ నుండి మరియు కూకట్ పల్లీ నుండి నేరుగా కొలనుపాకకు సిటీ బస్సుల సదుపాయము కలదు, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుండి వరంగల్ వెల్లే ట్రేయిన్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అక్కడ నుండి బస్ లో కాని ఆటోలో కాని 6 కి.మి ప్రయాణిస్తె కొలనుపాక గ్రామము చేరుకుంటారు.