Chaya Someswara Swamy Temple in Telangana

Chaya Someswara Swamy Temple in Telangana

Chaya Someswara Swamy Temple in Telangana

Chaya Someswara Swamy Temple is located in Panagal village, Nalgonda district of Telangana, India. This temple was built during 11th&12th centuries by the Ikshvaku family. The temple got the name as it is believed that there is an everlasting shadow on Lord Shiva’s Lingam in the main temple, all day. The Chaya Someshwara Swamy Aalayam in the Nalgonda district is an epitome of beauty, arts and spectacle. The temple got its name from its mystifying shadow or Chaya. This amazing temple, engineered by the Kunduru Cholas is accepted as Thrikutalayam. It testifies the fantastic creative thinking and flair of its architects.

Chaya Someswara Swamy Temple in Telangana 

 

 

 

One of the temple’s Garbhagudis, in the west and facing east, of the Thrikutalayam always witnessesa shadow and this mystery attracts thousands of visitors to this Temple.

Chaya Someswara Swamy Temple in Telangana

   How to Reach:-

Chaya Someswara Swamy temple, Panagal is located at a distance of nearly 4 km from the district headquarters of Nalgonda.
    Temple Timings:-

All Days of the Week
6:00 AM – 12:00 PM
2:00 PM – 8:00 PM

    Where to eat:-
 There are few small eateries near the temple. Nalgonda town close by offers more options for hotels.
    Where to stay:-
Nalgonda town close by offers budget hotels and deluxe hotel options for stay.

    Emergency Care:-

 District Government Hospital
Rahamath Nagar, Ramgiri, Nalgonda, Telangana 508001, India
+91 86822 23899

Sandhya Nursing Home
Panagal Rd, Savarkar Nagar, Nalgonda, Telangana 508001, India

Chaya Someswara Swamy Temple in Telangana

 ఆలయ ముఖద్వారం దక్షిణందిశ  వైపు ఉండటం, గర్భగుడిలోని శివలింగంపై సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిరంతరం నీడ పడడం… ఛాయాసోమేశ్వర దేవాలయం ప్రత్యేకత. 
సూర్యభగవానుని భార్య, శనీశ్వరుని తల్లి అయిన ఛాయాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి నిత్యం శివలింగంపై నీడపడేలా ఇక్కడ ఆలయం నిర్మించారని పెద్దలు చెబుతారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన ఈ నాటి సమాజానికి సైతం ఆ ఛాయ ఎక్కడి నుంచి వస్తుతోందన్నది సవాలుగానే ఉంది. ఆనాటి వాస్తుశిల్పుల నిర్మాణ కౌశలానికి ప్రతీకగా నిలుస్తోంది ఛాయాసోమేశ్వర దేవాలయం. 
నల్గొండ జిల్లా పానగల్‌లో ఉన్న ఛాయాసోమేశ్వరాలయాన్ని 12వ శతాబ్దంలో కుందూరు చోళులు నిర్మించారు. త్రికూట ఆలయంగా కూడా ప్రసిద్ధిచెందిది .  ఈ ఆలయంలో శిల్పకళా  సంపద ఎంతో అందంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా దక్షిణం దిశ  వైపు ముఖ ద్వారంతో ఎనిమిది ఉప ఆలయాలతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఛాయాసోమేశ్వరాలయాన్ని దర్శించుకుంటే శత్రు నివారణ, శనిదోష నివారణ జరుగుతాయనీ, నర దిష్టి పోతుందనీ భక్తుల విశ్వాసం. దేవాలయం లో శివలింగంపైన పడుతున్న నీడ ఎక్కడి నుంచి వస్తుందనేది మాత్రం నేటికీ తేలని అంశమే. పలువురు భౌతిక శాస్త్రవేత్తలు, విదేశీయులు సైతం దీనిని పరిశీలించారు. వారంతా కూడా ఇలా జరుగుతుండవచ్చు… అంటూ తమ భావనలు చెప్పారు తప్పితే కచ్చితంగా దీనివల్లనే అని వారు ఎవరూ నిర్ధారించలేకపోయారు. 
నల్గొండ పట్టణానికి ఉత్తరం దిక్కున పానగల్‌ గ్రామం ఉంది. ఉదయ సముద్రం చెరువు దిగువన 12వ శతాబ్దంలో కుందూరు చోళరాజులలో ఒకరైన ఏరువ మహారాజు పానగల్‌ను రాజధానిగా చేసుకుని పాలిస్తున్న కాలంలో ఆలయాన్ని నిర్మించాడని ఆనాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. పానగల్‌లోనే పచ్చల సోమేశ్వరాలయమూ, పానగల్‌ ఉదయ సముద్రం చెరువుకు పైభాగాన సందనపల్లి సమీపంలో సోమేశ్వరస్వామి ఆలయమూ నిర్మించారు. ఈ ఆలయాలన్నిటినీ పూర్తిగా రాతితో నిర్మించారు. సోమేశ్వరాలయం తెల్లరాయితో, పచ్చల సోమేశ్వరాలయం పచ్చరాయితో నిర్మించారు. మూడింటిలో ప్రధానమైనది త్రికూట ఆలయంగా ఉన్న ఛాయాసోమేశ్వరాలయం. ఈ ఆలయం గర్భగుడిలో శివలింగం, తూర్పు దిక్కున గల ఆలయంలో సూర్యభగవానుడు, ఉత్తరం దిక్కున  ఉన్న ఆలయంలో శ్రీమహావిష్ణువు కొలువై ఉన్నారు. ఆలయంలోని గర్భగుడిలో ఒంటరిగా కూర్చుని స్వామిని ధ్యానిస్తూ ఉంటే ఓంకార నాదం విన్పిస్తూ  ఉంటుంది . 
 ఓంకారనాదం ప్రతిధ్వనించేలా ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం జరిపారని భక్తుల నమ్మకం. ఆ నాదం విన్న అనుభూతిని పొందిన భక్తులు అనేక మంది ఆలయాన్ని తరచూ దర్శిస్తుంటారు. ఛాయాసోమేశ్వరాలయాన్ని శివ పంచాయతనం ప్రకారం నిర్మించారని పండితులు చెబుతుంటారు. ఆలయం ప్రాగణంలో పలు ఉప ఆలయాలు ఉన్నాయి. కాలభైరవుడు, క్షేత్రపాలకుడు, అభయాంజనేయస్వామి, రాజరాజేశ్వరి, వినాయకుడు, కుమారస్వామి ఉన్నారు. నాటి శిల్పులు ఎంతో నైపుణ్యంతో నిర్మించిన ఈ ఆలయంలోని అతి పెద్ద నందీశ్వరుడు, శనిదేవుడు, త్రికూట ఆలయం శిఖరంపైన ఉన్న రాతి శిఖరాలు కాలక్రమంలో నాశనం  అయ్యాయి . మహాశివరాత్రి రోజు స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది . కాలక్రమేణా ఆలయం నిత్యపూజలకు కూడా నోచుకోని పరిస్థితి వచ్చింది . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 సంవత్సరం కృష్ణా పుష్కరాల సందర్భంగా నల్గొండలోని పానగల్‌ ఛాయాసోమేశ్వరాలయానికి పూర్వవైభవం వచ్చి  ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు సిమెంట్ రోడ్డు, కొలను పూడికతీత పనులు జరిగాయి. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆలయం కొలనును అబివృద్ధిపరిచి, పుష్కరఘాట్‌ నిర్మించారు. ఉదయసముద్రం చెరువు నుంచి నీరు కొలనులోకి వచ్చి బయటకు వెళ్లేలా ప్రత్యేకంగా కాలువ ఉంది. దాంతో భక్తులు కృష్ణా నదిలో స్నానం చేసిన అనుభూతిని పొందుతున్నారు.