ఆవు గురించి వివరణ Description of the cow Telugu -

ఆవు గురించి వివరణ Description of the cow Telugu

?ఆవు గురించి వివరణ?

?ఈ ప్రపంచంలో గోవు శరీరం అత్యంత ఆరోగ్యకరమైనది, పవిత్రమైనది. వేదకాలం నుండి గోవు మనకు ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయ సాధనాలను సమకూరుస్తున్నది. భూలోకంలో ఆవు కామధేనువుతో సమానం. అంతటి మ¬న్నతమైన గో సంపదను సంరక్షించి, మన దేశాన్ని ఆర్థిక అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళడం మనందరి కర్తవ్యం.

వైజ్ఞానికముగా ఆవు ప్రాధాన్యత
?– ఒక తులం ఆవు నెయ్యితో యజ్ఞం చేస్తే ఒక టన్ను ప్రాణవాయువు (ఆక్సిజన్‌) లభిస్తుంది. అంతేకాక వాతావరణం కాలుష్యరహిత మవుతుంది.

?– గృహాలను, వాకిళ్ళను ఆవుపేడతో అలికినట్లయితే రేడియోధార్మిక కిరణాల నుండి రక్షణ పొంద వచ్చు.

?– గో మూత్రంలో నైట్రోజన్‌, కార్బాలిక్‌ ఆసిడ్‌ వంటి రసాయనాలున్నాయి. పాలిచ్చే ఆవు మూత్రంలో లాక్టోజ్‌, సల్ఫర్‌, కాపర్‌, మాంగనీస్‌, పొటా షియం, అమ్మోనియా, గ్యాస్‌, యూరియాసాల్ట్‌ మరియు ఎన్నో రకాల క్షారాలు, ఆరోగ్యకరమైన ఆమ్లాలు ఉన్నాయి.

?– అణుధార్మిక శక్తి నుండి వచ్చే హానికర వాయువుల నుండి రక్షణ పొందగల సర్వాధిక శక్తి ఆవు పాలల్లో ఉంది.

?– ఆవు నెయ్యిని బియ్యంతో కలిపి, ఆవు పిడకలపై వేడిచేస్తే ఇథిలిన్‌ ఆక్సైడ్‌, ప్రొపిలిన్‌ ఆక్సైడ్‌, ఫార్మాల్డిహైడ్‌లు ఉత్పన్నమవుతాయి. కృత్రిమ వర్షం కురిపించడం కోసం ప్రొపిలిన్‌ ఆక్సైడ్‌ ఆధారమని విజ్ఞానశాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

?– పచ్చి ఆవు పేడ నుండి బయోగ్యాస్‌ మరియు విద్యుత్‌ లభిస్తున్నాయి. గో మూత్రంతో విద్యుత్‌ తయారవుతున్నది. గోడ గడియారాలు నడుస్తు న్నవి.

ఆరోగ్య ప్రదాయినిగా ఆవు

?– ఆవు పేడకు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని సంరక్షించే గుణముంది.

?– గర్భిణీ స్త్రీలు ఆవును పూజించి రోజూ 11 సార్లు అవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సుఖ ప్రసవంతో పాటు తెలివైన శిశువు జన్మిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

?– ప్రపంచంలో మానవులకు ప్రాణ వాయువును ఇచ్చే ఒకే ఒక ప్రాణి గోవు.

?– ఆవు పాలలో కలరా వ్యాధికారక క్రిములను నాశనం చేయగల లక్షణాలున్నాయని మద్రాస్‌కు చెందిన డా||కింగ్‌ పేర్కొన్నారు.

?– దీర్ఘరోగాలున్నవారు, మానసిక రోగులు కొంత కాలం గోశాలలో నివాసముంటూ గోసేవ చేస్తే ఆవు నుండి వెలువడే వాయుతరంగాల కార ణంగా పై రోగాలు నయమవుతాయని శాస్త్రజ్ఞుల పరిశీలనలో వెల్లడయింది.

?– ఆవు మూపురంలో ఉండే ‘సూర్యకేతునాడి’ కారణంగా, విషపదార్థాలను తిని కూడా అవు వాటిని అమృతతుల్యంగా మారుస్తుంది.

?– ఆవు పాలు శరీరంలో చురుకుదనాన్ని, స్ఫూర్తిని కలిగిస్తాయి. ఆయుష్షును పెంచుతాయి. జ్ఞాపక శక్తికి ఆవుపాలు శ్రేష్ఠమైనవి.

?– ఆవు పాలకు క్యాన్సర్‌, క్షయ, గుండెజబ్బులు, రక్తపుపోటు, మధుమేహం, కామెర్లు, కీళ్ళ నొప్పులు, మూలశంఖ, రక్తహీనత, మల బద్ధకం, ఉదర వ్యాధులు, వాయు సంబంధ వ్యాధులు, చర్మరోగాలు, నేత్ర వ్యాధులు, వికారము తదితర వ్యాధులను నివారించే గుణముంది.

?– ఆవు మూత్రం సేవిస్తే సర్వరోగ నివారిణిగా, సంజీవనిగా పనిచేస్తుంది.

?– ఆవు పాలలో మానవ శరీర పోషణకు అవసర మయ్యే మాంసకృత్తులు, పిండిపదార్థాలు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్లు మరియు కాల్షియం, ఫాస్ఫరస్‌వంటి లవణాలు సమృద్ధిగా వుంటాయి.

?– ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమ యం (పంచగవ్యం)తో అన్ని రకాల జబ్బులను నివారించగల ఔషధాలు తయారవుతున్నాయి. పంచగవ్యంలో విషాలన్నింటినీ తొలగించే శక్తి వున్నది.

ఆర్థికముగా ఆవు

?– మన జాతీయ ఆదాయంలో 6 నుండి 7 శాతం గో సంపద నుండి లభిస్తున్నది.

?– మన దేశ వ్యవసాయానికి, రవాణాకు 70 శాతం ఎద్దులే ఆధారం.

?– ఒక ఆవు నుండి సంవత్సరానికి 36 క్వింటాళ్ళ పేడ లభిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వున్న గో సంపదతో సంవత్సరానికి 32 కోట్ల టన్నుల పేడ లభిస్తోంది.

?– ఒక ఆవు తన జీవితకాలంలో 5,10,440 మందికి ఒక పూట భోజనం సమకూర్చగలదని స్వామి దయానంద సరస్వతి ”గోకరుణానిధి” గ్రంథంలో పేర్కొన్నారు.

?– ఎండిన ఆవుపేడ ఇంధనంగా ఉపయోగ పడు తున్నది. బూడిద ఎరువుగా, క్రిమిసంహారిణిగా, వంటపాత్రలను శుభ్రపరిచేదిగా ఉపయోగించు టతో కోట్లాది రూపాయలు పొదుపు అవుతు న్నాయి.

?– చనిపోయిన ఆవును ఒక్క సంవత్సరముపాటు నేలలో పాతిపెట్టడం ద్వారా అత్యంత విలువైన జీవన ఎరువు లభ్యమవుతుంది.

?– పంచగవ్య చికిత్స మరియు గో ఆధారిత వ్యవ సాయ పద్ధతుల ద్వారా దేశంలోని గ్రామా లన్నింటికీ ఉద్యోగావకాశాలు కల్పించవచ్చును.

?– సాధారణమైన ప్రతి ఆవు నుండి రోజుకి 10 కిలోల పేడ, 5 లీటర్ల మూత్రం లభిస్తాయి. గోసంతతికి చెందిన చిన్న లేగ దూడ నుండి కూడా సంవత్సరంలో రూ.20,000ల విలువ కల్గిన ఎరువులు లభ్యమవుతాయి.

?– గో మూత్రం నేడు క్రిమిసంహారిణిగా ఉపయోగపడుతోంది.

?– బులంద్‌ షహర్‌, కాన్పూర్‌, ఢిల్లీ పట్టణాలలో ఎద్దులతో నడిచే ట్రాక్టర్‌ రూపొందింది. దీని ఉపయోగంతో ఖర్చు తగ్గి, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.

?– చనిపోయిన ఆవు కొమ్ములో ఆవు పేడను నింపి, స్వచ్ఛమైన నేలలో దసరా నవరాత్రులలో పాతి పెట్టి ఉగాది నవరాత్రులలో తీయటం ద్వారా ఒక్కొక్క కొమ్ము నుండి లభించే జీవన ఎరువు 4 ఎకరాలకు సరిపోతుంది.

Leave a Comment